Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమన్లపై మన్మోహన్ సుప్రీంకు వెళ్లే అవకాశం?

బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణంలోని హిందాల్కో కేసులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పంపిన సమన్లపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 16న తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించడంతో సమన్లపై ఆయన సవాల్ చేస్తారని సమాచారం. మన్మోహన్ తో పాటు మరో నలుగురికి కూడా కోర్టు సమన్లు పంపి హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన నిజాయతీని నిరూపించుకుంటానని, సత్యమే బయటపడుతుందని మన్మోహన్ స్పందించిన సంగతి విదితమే.

More Telugu News